నూతన సంవత్సర గీతాలు – Telugu New Year Songs
నూతన సంవత్సర గీతాలు – Telugu New Year Songs
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు
పల్లవి:
కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు
దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2)
గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమే
నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)
1చరణం:
ఏ అపాయము నన్ను సమీపించక
ఏ కీడు నా దరికి చేరక (2)
ఆపదలో నుండి విడిపించావు
అనుదినము నన్ను కృపతో కాచావు (2)
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2) “కృపగల”
2చరణం:
ఇన్నినాళ్ళు నాకు తోడై
ఎన్నో మేలులతో దీవించావు (2)
విడువక యెడబాయక తోడైయున్నావు
శాశ్వత ప్రేమను నాపై చూపావు
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2) “కృపగల”
పల్లవి: నాతోనే ఉన్నావయ్య – క్షేమం ఇచ్చావయ్యా
నాతోడై ఉన్నావయ్యా – నన్నాధరించావయ్యా //2//
నినుపాడి కీర్తించేదన్ – కొనియాడి ఘన పరిచెదన్ //2//
యేసయ్య యేసయ్య – నాబలము నీవయ్యా
యేసయ్య యేసయ్య – నాకన్ని నీవయ్యా //2//
1. కృంగినవేళలో – దిగులుపడిన సమయములో //2//
లేవనెత్తి నడిపించావు – ధైర్యమిచ్చి బలపరిచావు //2//
అండగా నీవుండి – మెండుగా దీవించావు..
నినుపాడి కీర్తించేదన్ – కొనియాడి ఘన పరిచెదన్ //2//
యేసయ్య యేసయ్య – నాబలము నీవయ్యా
యేసయ్య యేసయ్య – నాకన్ని నీవయ్యా //2// //నాతోనే ఉన్నావయ్య//
2. ఎదురైనా శ్రమలెన్నెన్నో – అడ్డొచ్చిన అవరోదాలెన్నో //2//
నా పక్షమున నీవున్నావు – పగలు రేయి కాపాడావు //2//
అండగా నీవుండి – మెండుగా దీవించావు..
నినుపాడి కీర్తించేదన్ – కొనియాడి ఘన పరిచెదన్ //2//
యేసయ్య యేసయ్య – నాబలము నీవయ్యా
యేసయ్య యేసయ్య – నాకన్ని నీవయ్యా //2// //నాతోనే ఉన్నావయ్య//
విలువైన నీ కృప నాపై చూపి -కాచావు గతకాలము
ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం
దినములు సంవత్సరాలు – గడచిపోయెను ఎన్నో
ప్రతి దినము ప్రతి క్షణము – కాపాడినావు నీ దయలో
నా జీవితకాలమంతా – నను నడుపుము యేసయ్య
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య || 2 || విలువైన ||
గడచిన కాలమంతా తోడైఉన్నావు
అద్భుతాలు ఎన్నో చేసి చూపావు ||2 ||
లెక్కించలేని మేలులతో – తృప్తిపరిచావు
నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు
నా జీవితకాలమంతా – నను నడుపుము యేసయ్య
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య || 2 || విలువైన ||
సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా
నూతన కార్యాలు ఎన్నో చేసావు ||2 ||
సంవత్సరమును నీ దయాకిరీటం ధరింపజేసావు
మా దినములు పొడిగించి నీ కృప లో దాచావు
నా జీవితకాలమంతా – నను నడుపుము యేసయ్య
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య || 2 || విలువైన ||
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."