Yentha Premamayudavu Yesayya – ఎంత ప్రేమా మయుడవు యేసయ్య

Faith Score0
Faith Score0

Yentha Premamayudavu Yesayya – ఎంత ప్రేమా మయుడవు యేసయ్య

పల్లవి: ఎంత ప్రేమా మయుడవు యేసయ్య – నీ ప్రేమకై స్తోత్రం
ఎంత కృపామయుడవు
యేసయ్య – నీ కృపకై స్తోత్రం //2//
పాడినా పలికినా తీర్చలేను నీ రుణమును //2//
నీ ప్రేమ నీజాలి నీ దయ నీ కరుణ ఇంతయని వర్ణింప //2//

1. నా తల్లి నా తండ్రి నన్ను మరచిన
నా సొంత జనులే నన్ను విడిచిన //2//
నేను నిన్ను మరువలేదు – నా అరచేతులలో నిన్ను చెక్కియున్నానంటివే //2//

2. పర్వతాలు తొలగీపోయినను మెట్టలు తత్తరిల్లిపోయినను //2//
నా కృప వీడదని సమాధానం ఉండునని అభయమిచ్చితివే //2//

3. అడుగుము ఇస్తానంటివి
అడిగి ఊహించు వాటికంటే ఇస్తానంటివి //2//
అడగక మునుపే నాకై ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుడవే //2//. //ఎంత//

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo