Yesayya Na Hrudayabhilasha Nivenayya – యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తియ్యని తలంపులు నీవేనయ్యా
పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు
పూజనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నా కనుల మెదలుచున్నవాడా ||యేసయ్యా||
ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలచియున్నవాడా ||యేసయ్యా||

