యేసయ్యా యేసయ్యా నీ మాట – Yesayya Yesayya Ne Mata Chalayya
యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా “4”
బలమైనది నమ్మదగినది స్వస్థతనిచ్చేది
రక్షణనిచ్చి ఆదరించేది “2”
నీ మాటే యేసయ్యా మము బ్రతికించేదయ్యా
నీ మాటే యేసయ్యా మా అక్కరలన్ని తీర్చేది “2”
“యేసయ్యా “
1.నీ మాట చొప్పున వలలు వేయగా విస్తారమైన చేపలతో వలలు నిండెనయ్యా
నీ మాట చొప్పున చెట్టు దిగిన జెక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినదయ్యా “2”
అయిదు రొట్టెలు రెండు చేపలు అయిదు వేల మందికి పంచెను నీ మాటే యేసయ్యా”2″
” నీ మాటే”
- నీ మాట చొప్పున నమ్మి వెళ్లిన శతాధిపతి దాసుడు స్వస్థత పొందెనయ్యా
నీ మాట చొప్పున పాపము విడచిన సమరయ స్త్రీ
జీవజలములు పొందుకున్నదయ్యా “2”
చనిపోయిన లాజరును సమాధిలోనుండి జీవముతో లేపినది నీ మాటే యేసయ్యా “2”
” నీ మాటే”


