Amulya Rakthamu dwara Rakshana pondina janulara – అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా

Faith Score0
Faith Score0

Amulya Rakthamu dwara Rakshana pondina janulara – అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా

అమూల్య రక్తము ద్వారా – రక్షణ పొందిన జనులారా
సర్వశక్తుని ప్రజలారా – పరిశుద్ధులారా పాడెదము
ఘనతా మహిమ స్తుతులను – పరిశుద్ధులారా పాడెదము

మన యవ్వన జీవితముల్‌ – శరీరాశకు లోబరచి
చెడు మాటలను బలుకుచు – శాంతిలేక యుంటిమి

చెడుమార్గమున పోతిమి – దాని యంతము మరణము
నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి

నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక
స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి

కనికరము గల దేవుడు – మానవ రూపము దాల్చెను
ప్రాణము సిలువను బలిచేసి – మనల విమోచించెను

తన రక్త ధారలలో – మన పాపములను కడిగి
మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో

పాపులమైన మనమీద – తన యాశ్చర్య ఘనప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము

మన రక్షకుని స్తుతించెదము మనలను జేసెను ధన్యులుగా
మన దేవుని కర్పించెదము – ఆత్మ జీవ శరీరములన్‌

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo