Athmaswaroopuda – ఆత్మ స్వరూపుడా Telugu Christian Song lyrics in English.
Lyrics, tune & Vocals by Pastor.Srikanth (Yehoshapath)
పల్లవి
ఆత్మ స్వరూపుడా అభిశక్తుడగు దేవా
అనంతజ్ఞాని మా జ్యోతిర్మయుడా
నిను మనసారా పూజించి మదిలోన
నిను తలచి దినమెల్ల నే పాడెదన్
నా హృదిలోన నిను కొలచి నీ నామ
స్తుతి చేసి నిన్నే ఆరాదింతున్ యేసయ్య
1.మోడుబారినా నా జీవితాన్ని
చిగురింపజేసినా ఆత్మస్వరూప
నిశీదిలో ఉన్న నా పాప బ్రతుకును వెలిగించినవా దివ్య స్వరూప
నా పాదములకు అది దీపము నీ వాక్యము
నే వెళ్లు మార్గములన్నిటికి వెలుగాయేనయ్య
2.నీ రూపులోనే నన్ను చేసి తండ్రి
జీవము పోసిన ఆత్మస్వరూపా
నీ చేతితోనే నను నిర్మించి నాలో నివసించె పరిశుద్ధుడా
నీ ఆనంద తైలముతోనే నను అభిషేకించు
నీ ఆత్మ నాలో నిలువెల్ల క్రుమ్మరించు
Athmaswaroopuda Lyrics, ఆత్మ స్వరూపుడా Lyrics
Athmaswaroopuda Song Lyrics in English
Gesthemane Prayer Hall Presents
Song Name – Athmaswaroopuda
Lyrics, tune & Vocals by Pastor.Srikanth (Yehoshapath)
Music by Symonpeter Chevuri
సమస్తమైన మహిమ యేసయ్యకే చెల్లును గాక ! ఆమెన్
ఎన్నో పాటలు పాడిన మీరు ఈసాంగ్ చాల అద్భుతం గా పాడారు దేవునికే వందనములు.
ఇలాంటి ఇంకా మరెన్నో పాటలు పాడి మీరు దేవునికి మహిమ కరంగా జీవించాలని కోరుకుంటున్నా ను.
Key Takeaways
- The article presents the Athmaswaroopuda Lyrics – ఆత్మ స్వరూపుడా, a Telugu Christian song.
- Pastor Srikanth composed the song, including lyrics, tune, and vocals.
- The lyrics express devotion, highlighting themes of worship and spirituality.
- The article contains links to other related songs and encourages readers to explore them.
- Overall, it celebrates the beauty and impact of the song in Christian worship.
Estimated reading time: 2 minutes
