Baethelemu Purama Lona Raksakudu – బెత్లెహేము పురము లోన రక్షకుడు ఓయమ్మో
Baethelemu Purama Lona Raksakudu – బెత్లెహేము పురము లోన రక్షకుడు ఓయమ్మో
పల్లవి :-
బెత్లెహేము పురము లోన రక్షకుడు ఓయమ్మో
కన్నియ గర్భాన జనియించినాడమ్మ
బెత్లెహాము పురము లోన రక్షకుడు ఓరన్న
కన్నియ్య గర్భాన జనియించినాడన్న
లోకాన్ని ప్రేమించి పాపాన్ని క్షమియించి – మోక్షాన్ని మనకివ్వ ధరకేగినాడమ్మో
లోకాన్ని ప్రేమించి పాపాన్ని క్షమియించి – మోక్షాన్ని మనకివ్వ ధరకేగినాడన్న
అను పల్లవి:-
రండి మనం అందరం పండుగ చేద్దాం
రారాజు పుట్టాడని ఎలుగెత్తి చెప్పుదాం (2). || బెత్లెహేము ||
చరణం 1 :-
శుభవార్త చెప్పేందుకు ఒక దూత వచ్చెను
ఆ గొర్రెల కాపరులకు ఆనవాళ్ళు చెప్పెను (2)
శిశువును దర్శించి,ఆనందం వికసించి
మెస్సయ్య జనన వార్తను చాటించి నారమ్మో (2)
రండి మనం అందరం పండుగ చేద్దాం
రారాజు పుట్టాడని ఎలుగెత్తి చెప్పుదాం (2). || బెత్లెహేము ||
చరణం 2 :-
క్రీస్తు యేసు పుట్టిననాడు ఒక తార వెలిసెను
ఆ తార జ్ఞానులకు త్రోవను చూపించెను (2)
బంగారం సాంబ్రాణి బోళముని అర్పించి
మహారాజు పుట్టాడని పూజించి నారమ్మో (2)
రండి మనం అందరం పండుగ చేద్దాం
రారాజు పుట్టాడని ఎలుగెత్తి చెప్పుదాం (2) || బెత్లెహేము ||
ANIYINCHINADU || జనియించినాడు || PSH Worship Team Originals || New Christmas Telugu Song 2023
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."