Bethlehemu Puramulo Lyrics – బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి

Faith Score+2
Faith Score+2

Bethlehemu Puramulo Telugu Christmas Song Lyrics – బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి

బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
ఊహలకు అందని అద్భుతము జరిగెను
లోక చరిత మార్చిన దైవకార్యము
కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను
అహహ్హ ఆశ్చర్యము ఓహోహో ఆనందము
రారాజు యేసు క్రీస్తు ని జననము
అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము
సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము

ధన్యులం హీనులం మనము ధన్యులం
దైవమే మనల కోరి దరికి చేరెను
మనిషిగా మన మధ్య చేరే దీన జన్మతో
పశువుల తోట్టెలోన నిదుర చేసెను
అంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలు
మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి

పుట్టెను యూదులకు రాజు పుట్టెను
వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి
నడిపెను ఆకశాన తార కనపడి
నిలిచెను యేసు ఉన్న చోటు తెలుపెను
తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు
యేసు చెంత మొకరించి కానుకలర్పించిరి

దొరికెను రక్షకుడు మనకు దొరికెను
తోడుగా ఇమ్మనియేలు మనకు దొరికెను
దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను
యేసుని రూపమే మనకు సాక్షము
యేసు జన్మ నింపేను లోకమంతా సంబరం
నింపెను నిరీక్షణ కృపయు సమాధానము

Bethlehemu Puramulo Lyrics in English

Bethlehemu Puramulo Song Lyrics, బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి Lyrics

 

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the Christmas song ‘Bethlehemu Puramulo,’ celebrating the birth of Jesus.
  • It describes the miraculous event in Bethlehem, emphasizing joy and divine purpose.
  • The song reflects on the visit of shepherds and wise men to see Jesus.
  • Additionally, it features links to other related Telugu Christmas songs.
  • Published by World Telugu Christians, it serves as a resource for Telugu Christian music and devotionals.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo