దేవాది దేవుడు మనుజావాతారిగ – Devadi Devudu Telugu Christmas Song Lyrics
పల్లవి
దేవాది దేవుడు మనుజావాతారిగ
పరముని వీడి ఇహమునకు వచ్చాడు
నిశి రాత్రి వేళలో ఒక చిన్న ఊరిలో
లోకానికి వెలుగును పంచగ పుట్టాడు
ఇది శుభమని మనకు తెలిపెను గాబ్రియేలు దూత
రారండి తేరి చూతుము ఆ రాజాది రాజును
కానుకలు అర్పించి మ్రొక్కిరి గొల్లలు జ్ఞానులు ఎళ్లరు
బంగారము సాంబ్రాణి, బొలముప్రభుకే అర్పించేదము
1 చరణం
భయపడకని మరియతో పలికెను దూత
ఉదయించును రక్షకుడు అను శుభవార్త
జగములను పరిపాలించెడి రేడు
మమ్ము కావగ జన్మించెను ఈనాడు
పయనాన్ని చూపించింది ఒక తార
అది వెళ్లి ఆగిన చోటు ద్వారా
ధివి భూవిని కాపాడే మహారాజు
పశు పాకలో పరుండెనే ఈ రోజు
దేవాది దేవుడు….
2 చరణం
సర్వలోక రక్షకుని ఆగమనం
లోకమంత పర్వదినం ఈ సమయం
సంతసానికి అవధులు అన్నవి లేవు
తన్మయంలో ఉప్పొంగెను నా హృదయం
కనులారా చూతుము రండి ఈ బాలుని
మనసారా కొలిచెదము మన దేవుని
దూతలంతా జోలలు పాడే దృశ్యం
పదములతో వర్ణించుటకు ఆశక్యం
Devadi Devudu Lyrics in English
దేవాది దేవుడు మనుజావాతారిగ Lyrics, Devadi Devudu Song Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Estimated reading time: 2 minutes
Estimated reading time: 2 minutes
