Devude Padithe – దేవుడే పాడితే

Faith Score0
Faith Score0

Devude Padithe – దేవుడే పాడితే

పల్లవి

ఎన్నాళ్ళని ఎన్నాళ్ళని ఎదురు చూడాలి (చూసేది)
ఓ పిల్లలారా
నా పిల్లలారా

ఎన్నేళ్ళని ఎన్నేళ్ళని సహించు కోవాలి
నా పిల్లలారా – నా బిడ్డలారా
నా పిల్లలారా…
నా బిడ్డలారా…
నా పిల్లలారా..,…
నా బిడ్డలారా……
నా దరికి చేరండి
ఆ నరకానికి జారిపోకండి.

“ఎన్నాళ్ళని”

చరణం 1
చేసింది నేనే పెంచింది నేనే
నాకే విలువే లేదా….
పోషకుడను నేనే
సహాయకుడను నేనే
నేనే గురుతేలేదా?

నా కష్టం అంతా నీకై పోస్తే
నా హృదయమునే కృంగదీస్తారా?
నమ్మరా ఇక నమ్మరా నా గుండె కోత తెలుసుకోరా….

పిల్లలారా నా పిల్లలారా
బిడ్డలారా నా బిడ్డలారా

“ఎన్నాళ్ళని”

చరణం 2

సృష్టినే చేసి ఆకలినే తీర్చి జీవాన్ని ఇస్తుంది నేనే…

బంధాలను ఇచ్చే తల్లి తండ్రిగా మారే ప్రేమే నాదే కాదా….

నా అరచేతిలో నిను చెక్కుకున్న ముదిమి వచ్చు వరకు నిను ఎత్తుకున్న
నమ్మరా ఇది నమ్మరా నా ప్రేమనే గ్రహియించరా….

పిల్లలారా నా బిడ్డలారా…నరులారా నా జనులారా….
“ఎన్నాళ్ళని”

చరణం 3

పాపములో వున్నా
నిను విడిపించుటకు
రక్షకునే నీకై పంపానుగా….

తన రక్తమిచ్చి ప్రాణమునే పెట్టి మీకై బలి చేశానుగా….

పరిశుద్ధులుగా నిర్దోషులుగా నా యొద్దకే మీరు రావాలని
కోరిక చిన్న కోరికా నా కోరికనే మీరు తీర్చరా

పిల్లలారా ఓ తనయులారా
ప్రజలారా నా వారసులారా….

“ఎన్నాళ్ళని”

Devude Padithe Lyrics, Telugu Christian Song.

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo