ఏదైన చేయగలవు యేసయ్య – Edhina Cheyagalavu yessayya
ఈ జీవిత కడలి లో భారమైన బ్రతుకులో
నీవు నాకు తోడుంటే చాలు యేసయ్య
అలల సుడిగాలులలో బ్రద్దలైన నావలో
చుక్కాని నీవైతే చాలు యేసయ్య
Chours: ఏదైన చేయగలవు యేసయ్య
లేదు నీకు అసాధ్యము మెస్సయా
- గాఢాంధకారములోన ఒంటరైన సమయాన
దావీదుకు తోడై నిలచి నడిపించిన దైవమా
ఆ చీకటి తొలగించి వెలుగును ప్రసరింపచేసి అల్పుడైన దావీదుని రాజుగా నీవు చేసినావే
ఏదైనా చేయగలవు యేసయ్య
లేదు నీకు అసాధ్యము మెస్సయా
- బానిసగా అమ్మబడి అనాధగా విడువబడి
చెరసాలలో వేయబడినా యోసేపును చూసినావే
ఐగుప్తు దేశములోనే శ్రేష్ఠమైన స్థానమునిచ్చి
ఘనముగా నిలిపిన నీవు ఘనుడైన దేవుడవు
ఏదైనా చేయగలవు యేసయ్య
లేదు నీకు అసాధ్యము మెస్సయా
- నా పాపబ్రతుకును చూసి ఆ దివ్య భాగ్యం విడచి నాకోసమే మరణించి నన్ను రక్షించినావే
యుగయుగములు నీతో కలసి సహవాసము చేయుటకు త్వరగా రానైయున్న
మేఘర్హుడవు నీవే
అంతము వరకు నా పయనం కొనసాగిస్తా
తరతరములు నీతో కలిసి నే జీవిస్తా
