Endukayya Nenante Intha Prema – ఎందుకయ్యా నేనంటే ఇంత ప్రేమా

Faith Score0
Faith Score0

Endukayya Nenante Intha Prema – ఎందుకయ్యా నేనంటే ఇంత ప్రేమా

ఎందుకయ్యా నేనంటే ఇంత ప్రేమా
ఎందుకయ్యా నాపైన ఇంత కరుణా
కన్నీటి లోయలోన తిరిగేటి వేళలోన
వెదకి నన్ను పిలచుచున్నావు

ఏదారి కానరాక తిరుగుతున్న నన్ను
నాదారి నీవై నీదరికి చేర్చినావు
ఆశ్రయం లేనినాకు ఆశ్రయం అయినావు
ఈ జీవితం ప్రభు నీకంకితం

ఏప్రేమ నోచుకోని నాబ్రతుకులో నీవు
నీప్రేమ వెలిగించి వెలుగుగా ఉన్నావు
ఒంటరి నేనని నా తోడుగ ఉన్నావు
నా జీవితం ప్రభు నీకర్పితం

Endukayya Nenante Intha Prema Telugu Christian Song Lyrics.
సమర్పణ వాల్యూం 5 సాంగ్ 6 దేవుని ప్రేమ
Samarpana Vol 5 Album songs
Lyrics and Tune by Mercy George Kakarlamudi

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo