గడిచిన కాలమంతా నను – Gadachina kalamantha

Faith Score+1
Faith Score+1

గడిచిన కాలమంతా నను – Gadachina kalamantha

గడిచిన కాలమంతా నను నడిపిన నా దేవా
నీకంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా || 2 ||
మరో ఏడు నాకొసగినందుకు! నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు! నిన్నేమని కీర్తింతును || 2 || || గడిచిన ||

ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు
శూన్యమందయిన సకలం సాధ్య పరచెదవు || 2 ||
నామేలు కోరి నీ ప్రేమతో నను దండించితివి
చేలరేగుతున్న డంబములు నిర్మూల పరచితివి || 2 || || మరో ఏడు ||

నాదు కష్ట కాలములోన కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా || 2 ||
నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి
నీ ప్రేమతో నను పోషించి సత్తువ నింపితివి || 2 || || మరో ఏడు ||

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo