Jivitakalamantha – నా జీవితకాలమంతా నీ

Faith Score0
Faith Score0

Jivitakalamantha – నా జీవితకాలమంతా నీ

నా జీవితకాలమంతా నీ కృపయు క్షేమములే
నే బ్రతుకు దినములన్ని నీ శాంతి సమాధానమే(2)
నీవలనే ఈ ఆనందం నీ వలనే ఈ క్షేమము (2)
నా ప్రభువా నీ కొరకే నా స్తుతి యాగము(2)

1. నా అంతరంగములో విచారములు హెచ్చగా
నీ గొప్ప ఆదరణ నెమ్మది కలిగించెను (2)
శ్రమలలోనే కృంగిపోగా
నీదు బాహువు చాపినావు
ఉపద్రవములే వెంటరాగా
మహిమ మేఘమై నిలచినావు

2. ఈ లోక నటనలలో నె చిక్కుకొనియుండగా
నీ జీవ వాక్యముతో ప్రత్యేకపరిచితివి(2)
నశించిపోయే నన్ను వెదకి
నూతన సృష్టిగా మార్చినావు
గమ్యము లేని నా బ్రతుకునకు
నీవే గురిగా మారినావు

3. నా గతకాలమంతా వాత్సల్యం చూపితివి
నీ రెక్కల నీడలో భద్రము చేసితివి(2)
ఆశలన్ని సఫలపరిచి
నా ఉన్నతికి కారణమైతివి
దినములన్ని నీ మెలులను
అనుభవించి ఆరాధింతున్

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo