Lechi Velledham Saagi Velledham – లేచి వెళ్లెదం సాగి వెళ్లెదం
30
Telugu songs
Shop Now: Bible, songs & etc
Lechi Velledham Saagi Velledham – లేచి వెళ్లెదం సాగి వెళ్లెదం
పల్లవి: లేచి వెళ్లెదం – సాగి వెళ్లెదం
ఆ వాగ్దాన దేశమునకు సాగివెళ్లెదం
మన దేవుడు యెహోవాయే
ఎల్లవేళల సహాయుడు
సైన్యములకధిపతియైన అధిపతియైన
యెహోవా ఎల్ష్దాయిగా ఏలెను
1. విమోచించెను తన ప్రజలను
విడిపించును పాప దాస్యము
పరిశుద్ధ దేవుని ఆరాధించుటకు
యెహోవా కాదేషు శుద్ధిచేయును
2. పగటివేళ మేఘస్తంభము
రాత్రివేళ అగ్నిస్థంభము
త్రోవలో తోడుగా ఉండి నడిపించును
యెహోవా యీరే మన సహాయము
3. ఆకాశమునుండి మన్నాను ఇచ్చెను.
మారాను మధుర పానము చేయును
పాలు తేనెలతో తృప్తిపరచును
యెహోవా రోహి లేమిచేయడు
4. శత్రుసైన్యముపై జయమునిచ్చును
సముద్రములో దారినిచ్చును
దక్షిణహస్తముతో ఆదుకొనును
యెహోవా నిస్సీ ధ్వజమైయుండును