Na Akkaralanniyu Telugu Christian Song Lyrics,Tune.Vocals & Visuals by Pastor.David Varma & Bro.Chinny Savarapu – నా అక్కరాలన్నీయు
నా అక్కరాలన్నీయు ఎరుగినవాడవు
నా అవసరములన్నీ తీర్చే దేవుడవు
అడిగిన బతిమాలిన సాయంచేయని లోకంలో
అడగకమునుపే అక్కరలన్నీ ఎరిగిన తండ్రివి
నాకున్నది నీవే – నా యేసయ్య
ప్రాణమున్నంతవరకు నిన్ను నే విడువను
యేసయ్య యేసయ్య నాకున్నది నీవే
యేసయ్య యేసయ్య నాకున్నది నీవే
1. నే అడిగినవి ఎన్నో నీవు కాదనియాన్న
అర్థం కాక నీ ప్రేమ నీపై అలిగితినయ్యా
నే కోరిన బంధాలెన్నో నీవు దూరం చేసిన
పగిలిన హృదయముతో నీకె దూరమైతినయ్య
నేఅడిగిన వాటికన్నా అధికముగా చేసినవు
నే కోరినవాటికంటే నా క్షేమము కోరే తండ్రివి
నాకున్నది నీవే – నా యేసయ్య
ప్రాణమున్నంతవరకు నిన్ను నే విడువను
యేసయ్య యేసయ్య నాకున్నది నీవే
యేసయ్య యేసయ్య నాకున్నది నీవే
2. అవసరాలు ఎన్నో ఉన్న అవకాశమె కానరాక
చేతులన్నీ కాలియాయి దిగులుతో నిలిచితినయ్య
మెలులెన్నో పొందినవారే కీడుచేయ చూసిన
లేనిపోని మాటలతో గుండేనే చీల్చిన
కాలియైన బ్రతుకును సమృద్ధితో నింపినవు
పొందిన కీడు వెనక గొప్పమేలు దాచిన తండ్రివి
నాకున్నది నీవే – నా యేసయ్య
ప్రాణమున్నంతవరకు నిన్ను నే విడువను
యేసయ్య యేసయ్య నాకున్నది నీవే
యేసయ్య యేసయ్య నాకున్నది నీవే
3. కన్నవారి కన్నులకే భారమైపోయిన
కాలమెపుడు మారునోఅని కన్నీటితో నిలిచిన
ఓటమే అలవాటై – అందరికీ అలుసైన
బ్రతుకే నాకోదంటూ- చావునే వెతికిన
కన్నవారికంటే మించిన ప్రేమే చూపినవు
చావును వెతికిన నాన్నే విడువక నాకై వచ్చిన తండ్రివి
నాకున్నది నీవే – నా యేసయ్య
ప్రాణమున్నంతవరకు నిన్ను నే విడువను
యేసయ్య యేసయ్య నాకున్నది నీవే
యేసయ్య యేసయ్య నాకున్నది నీవే
Na Akkaralanniyu Lyrics in English
The New Life Ministries
Na Akkaralanniyu Song Lyrics, నా అక్కరాలన్నీయు Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article presents the lyrics for the Telugu Christian song ‘Na Akkaralanniyu’.
- It features themes of God’s love and provision, highlighting a personal relationship with Jesus.
- The lyrics emphasize trust in God despite life’s challenges and emotional struggles.
- The article includes additional links to other Telugu Christian songs and resources.
- ‘Na Akkaralanniyu Lyrics – నా క్కరాలన్నీయు’ serves as a central focus throughout the text.
Estimated reading time: 2 minutes

