నీ పాటే నాకు ప్రాణంగా – Ni pate naku prananga
నీ పాటే నాకు ప్రాణంగా పాడనా నీకు ఇష్టంగా గుండెలోతులో వున్నా మూగ భాషనే రాసి చెప్పనా మనసే కుమ్మరించనా విధినైనా ఎదురించి స్తుతించన “2”
1. నీ మాటలే ముక్తి మార్గాలని ఎలుగెత్తి ప్రకటించనా “2”
నా గానమే హృది గాయలను మాన్పే ఔష ధమావ్వని “2”
ఆశ వున్నదయ్య – ఆశీర్వాదించు యేసయ్య “2”
2. నీ మాటలే సర్వ సత్యలని సిలువెత్తి ప్రచురించన”2″
నా రాగమే అనురాగలను పెంచే సాధనమవ్వని “2”
ఆశ వున్నదయ్య – ఆశీర్వాదించు యేసయ్య “2”
3. నీ మాటలే నిత్యజీవాలని గొంతెత్తి వినిపించన “2”
నీ పాటలే ప్రతి పాపాలను విడిచే సువార్త అవ్వని “2”
ఆశ వున్నదయ్య – ఆశీర్వాదించు యేసయ్య “2”

