O Manasa krungipokuma Lyrics – ఓ మనసా కృంగిపోకుమా

Faith Score+1
Faith Score+1

O Manasa krungipokuma Telugu Christian Song Lyrics, Written and sung by Pas.Lazar – ఓ మనసా కృంగిపోకుమా

[ పల్లవి ]
ఓ..మనసా – కృంగిపోకుమా
కృప కలుగును – నిరీక్షించుమా [ 2 ]
తోడున్నానని – నడిపించువాడు
దీవిస్తానని – పలికినవాడు. [ 2 ]

విడువడు ఎడబాయడు – యేసయ్యా
ఘనపరచి హెచ్చించును – నీ స్థితిని [ 2 ]


చరణం :
ఆశలే కనుమరుగై – ఓటమే అలవాటై
అవమానాలతో – కుమిలిపోతివా
గమ్యమే తెలియక – ఒంటరై నిలువగా
ఎందుకీ బ్రతుకనీ – విసిగిపోతివా

తోడైన….యేసయ్యా….
శ్రమలకొలిమిలో నీతో నడచును
దుఃఖించకే మనసా
వేదనలన్నీ దీవెనలుగ మారును

విడువడు ఎడబాయడు – యేసయ్యా
సమకూర్చును సమస్తము – నీ మేలుకై [ 2 ]


చరణం :
దర్శనమే భారమై – విశ్వాసమే మరుగై
దీవేనే లేదని ? – సోలిపోతివా
సొంతవారే శత్రువులై – అసూయతో నిండి
విరోధముగ లేచిన – మూగబోతివా

దీవించు ..యేసయ్యా…..
రెండంతలుగా నీకు మేలు చేయును
చింతించకే..మనసా…
అణచబడిన నిన్ను – అధిపతిగా చేయును

విడువడు ఎడబాయడు – యేసయ్యా
వాగ్దానము నేరవేర్చును – నిశ్చయము [ 2 ]

O Manasa krungipokuma Lyrics in English

O Manasa krungipokuma Song Lyrics, ఓ మనసా కృంగిపోకుమా Song Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘O Manasa krungipokuma’ written and sung by Pas. Lazar.
  • The song conveys themes of hope and reliance on Jesus, emphasizing not to lose heart.
  • Chorus repeats the reassurance that Jesus will not abandon us, highlighting His promises.
  • The article also includes links to other Telugu Christian songs and resources.
  • Additionally, it mentions that the song lyrics are published by World Telugu Christians.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo