Papinaina Nannu vedaki – పాపినైన నన్ను వెదకి రక్షించావు
పాపినైన నన్ను వెదకి రక్షించావు
నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు
ఏమిచ్చి నీ బుణం నేతీర్చగలను
ఏమిచ్చి నే నిన్ను దర్శించగలను
అందుకో దేవా నా దీన స్తుతులు
అందుకో దేవా నా దీన ప్రార్థనా || పాడైన ||
1.ప్రేమ ఆనే మాయలో పడిపోయాను
మత్తు అనే ముసుగులో చెడిపోయాను || 2 ||
పడిపోయిన నన్ను లేవనేత్తావు
చెడిపోయిన నన్ను చేరదీసావు
మలినమైన నా బ్రతుకు శుద్ధి చేసావు || 2 || || అందుకో దేవా ||
2.పాపమనే ఊబిలో మునిగిపోయాను
జూదమనే ఆటలో జారిపోయాను || 2 ||
దిగజారిన నన్ను లేవనెత్తావు
మోక్షమేలేని నాకు మోక్షమిచ్చావు
హీనమైన నా బ్రతుకు మహిమ గా మార్చావు || 2 || || అందుకో దేవా ||
3.నీచుండ నైన నన్ను నిలువబెట్టావు
గౌరవం లేని నాకు అధికారమిచ్చావు || 2 ||
చనిపోయిన నన్ను బ్రతికించావు
నీ ప్రేమతో నన్ను బందినిచేసావు
పాడైన నా బ్రతుకు పరిమళముగ చేసావు || 2 || || అందుకో దేవా ||
