Pradhana Alakinchuvada – ప్రార్థన ఆలకించువాడా
ప్రార్థన ఆలకించువాడా – నా యేసయ్యా….
ప్రార్థనకు ప్రతిఫలము దయచేయువాడవు “2”
అనుపల్లవి: ప్రార్థించేదను మొరపెట్టేదను నీ సన్నిధిలో
ఫలమొందేదను బలముపొందేదను ప్రార్థనలో “2”
చర్ణం-1
పరిస్థితులు ఏవైనా – ప్రార్ధనే మా ఆయుధం
ప్రాణమే పోతున్నా – ప్రార్థనే మా ఔషధం “2”
పరిమితులే లేని వాడవు యేసయ్యా
పరికించి ఒకసారి మా ప్రార్థన వినుమా “2”
ఆలాపన: ప్రార్థనే మా ఆయుధం – ప్రార్థనే మా ఔషధం
ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే మా విజయం
ప్రార్థించేదను మొరపెట్టేదను “2”
చర్ణం-2
పరిపూర్ణ మనస్సుతో – నిన్నే నే ప్రార్థింతున్
పరిమళవాసనగా – నా ప్రార్ధనుండును గాక “2”
పశ్చాతాపముతో – నిన్ను ప్రార్థింతును
పరికించి ఒకసారి – నా ప్రార్థన వినుమా “2”
ఆలాపన: ప్రార్థనే మా ఆయుధం – ప్రార్థనే మా ఔషధం
ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే మా విజయం
ప్రార్థించేదను మొరపెట్టేదను “2”


