punaruddhanuda vijaya veeruda – పునరుద్ధానుడా విజయ వీరుడా

Faith Score0
Faith Score0

punaruddhanuda vijaya veeruda – పునరుద్ధానుడా విజయ వీరుడా

పల్లవి :
పునరుద్ధానుడా విజయ వీరుడా
నా బలము నీవే – నా ధైర్యము నీవే
మరణము గెలిచిన బహుశూరుడా || 2 ||
ఆరాధనా ఆరాధన అజేయుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన సజీవుడా నీకే ఆరాధన

చరణం :
పరిశుద్ధుడా నీ రక్తధారలే
శుద్ధి చేసెను నా పాపమంతటిని || 2 ||
నీ త్యాగమే నన్ను మార్చెను
నీ కోసమే ఇలలో జీవింతును || 2 ||
ఆరాధనా ఆరాధన అజేయుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన సజీవుడా నీకే ఆరాధన

చరణం :
ప్రేమామయ నీ జీవ వాక్యమే
ఆదరించెను నన్ను ఓదార్చెను || 2 ||
నీ కృపయే నా ఆధారము
నీ నామమే ఇలలో ఘనపరతును || 2 ||
ఆరాధనా ఆరాధన అజేయుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన సజీవుడా నీకే ఆరాధన

చరణం :
కరుణామయా నీ వాత్సల్యమే నాపై
దీవెనలు కుమ్మరించెను || 2 ||
నీ దయయే నాకు క్షేమము
నీ కీర్తినే ఇలలో ప్రకటింతును || 2 ||
ఆరాధనా ఆరాధన అజేయుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన సజీవుడా నీకే ఆరాధన

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo