Shapamunundi Vidudala – శపితముగల దినములనుండి

Faith Score0
Faith Score0

Shapamunundi Vidudala – శపితముగల దినములనుండి

పల్లవి:
శపితముగల దినములనుండి విడిపించుటకొరకు
ప్రతిజనమును తన రక్తముతో నూతన పరచుటకు
శపితముగల దినములనుండి విడిపించుటకొరకు
ప్రతిజనమును తన రక్తముతో నూతన పరచుటకు
ప్రభువైన క్రీస్తే మనకై తనను తాను తగ్గించుకుని
మట్టి దేహముతో ఇలపై పాపమునే గెలిచే…
ప్రభువైన క్రీస్తే మనకై దైవరూపమునే విడిచి
మట్టి దేహముతో ఇలపై మరణమునే గెలిచే…
శపితముగల

చరణం-1:
ఐగుప్తు దాస్యము నుండి తన ప్రజలను విడిపించుటకు
నీళ్లతో గోడలు కట్టి ఆధారమే ఇచ్చెనుగా
శత్రువుల గుండె బలమునే యెహోవా అణచివేసి
ఉన్నవాడననువాడనని రుజువులెన్నో చూపెనుగా
జ్ఞాపకార్థ నామముగా తన నామం తరములకిస్తే
యెహోవా నెరుగని తరమే మళ్ళీ జన్మించెనుగా
జ్ఞాపకార్థ నామముగా తన నామం తరములకిస్తే
యెహోవా నెరుగని తరమే పాపమే చేసెనుగా- శాపములో చిక్కెనుగా …
శపితముగల
చరణం-2:
అక్షయుని రూపమే క్షయమగు ప్రతి రూపముగా మార్చి
తుచ్ఛమైన కార్యములతో దుష్టులుగా మారిపోయిరి
కన్నతండ్రినే త్రోసివేసి కంటనీరునే ఒలికించి
మత్తులో మునిగితేలుతూ బ్రష్టులుగా మిగిలిపోయిరి
పాపప్రాయశ్చిత్తముకై బలియర్పణలే నియమిస్తే
పూర్ణసిద్ధిని పొందలేని ఘోరపాపమే చేసెనుగా
పాపప్రాయశ్చిత్తముకై బలియర్పణలే నియమిస్తే
మనసు మారక ఏటేటా ఘోర పాపమే చేసెనుగా- దాస్యములో చిక్కెనుగా…
శపితముగల

చరణం-3:
మన పాపదోషములే మలినమైన హృదయాలోచనలే
తలకు ముళ్ల కిరీటమై క్రీస్తును వేధించాయి
అంతరంగ పాపపు క్రియలే కామ క్రోధ మద మోహములే
కొరడాదెబ్బలుగా మారి యేసునే శిక్షించాయి
ఒక్కమారు వేడుకొనిన సేనా వ్యూహములొచ్చును గాని
పాపి మార్పు చెందుటకై రక్తమిచ్చి ప్రాణము విడచె
కేకలేసి సిలువవేసి శరీరమునే నలుగగొట్టిన
మౌనముతో మరణమునొంది సజీవుడై తిరిగిలేచెనే- విమోచన కలుగజేసెనే…
శపితముగల

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo