Sidilamai Potundi – శిథిలమైపోతుంది మానవదేహం

Faith Score+5
Faith Score+5

Sidilamai Potundi – శిథిలమైపోతుంది మానవదేహం

శిథిలమైపోతుంది మానవదేహం
అది దేవుడు నిర్మించిన దేవాలయము “2”
కట్టడాలకున్న విలువ మనిషికున్నదా
పరలోకం వెళ్ళేది మనుషులే కదా
తిరిగి కట్టండి చితికిన బ్రతుకు
నిలబెట్టండి దేవుని కొరకు

మరుగున పడి పోతుంటే దేవుని నిజ మందిరం
మెరుగు దిద్దుకుంటుంది మానవుని కట్టడం “2”
గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్య
మనిషిని మించిన దేవాలయమేదయ్యా “2”

గేర సేనల దేశంలో ఒకడున్నాడు
బ్రతికి యుండగానేవాడు స్మశానం చేరాడు “2”
శిథిలమై పోయిన వాని బ్రతికును
పదిలముగా చేసి ఏసు నిలువబెట్టెను “2”

హస్త కృతలయములో దేవుడే ఉండడు
ఆ దేవుడు చెప్పిన నా ఈ మనుష్యుడు వినడు “2”
యేసు వచ్చేది కట్టడాలు చూచుటకా
చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరకా “2”

Sidilamai Potundi song lyrics

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo