Sree Yesu Manakoraku Janminchinaadu Telugu Christmas Song Lyrics – శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన
సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన || 2 ||
ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు
మోకరించి చెబుదాము వేల వేల వందనాలు || 2 ||
ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము
ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము || 2 || || శ్రీయేసు ||
పాపాలకు, మన లోపలకు – ఇఁక చెల్లి పోయింది కాలము
మనలోన చీకటి, తొలగించగా – నేడు తెచ్చాడు మనకై తన తేజము || 2 ||
వేలాది సూర్యులంత వెలుగున్న వాడు
వెలలేని మనిషిగా మనలా మెలిగాడు || 2 || || ఓ అయ్యా ||
మరణము చెరలను గెలిచేందుకు – ఇచ్చాడు బహుమతిగా తన జీవము
తన సన్నిధిని విడిచిన మనలను – చేర్చేందుకయినాడు తను మార్గము || 2 ||
ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను
మహిమలో నిలపాలని మహిమ విడిచాడు || 2 || || ఓ అయ్యా ||
Sree Yesu Manakoraku Janminchinaadu song lyrics in English
Sree Yesu Manakoraku Janminchinaadu Lyrics, శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christmas song ‘Sree Yesu Manakoraku Janminchinaadu’.
- The song celebrates the birth of Jesus and conveys themes of joy and light.
- It describes the joy brought by Jesus and the significance of his life and gift to humanity.
- Published by World Telugu Christians, the article includes a brief introduction and context for the song.
Estimated reading time: 2 minutes
