Swasthatha parachu Yehova Nive – స్వస్థత పరచు యెహోవా నీవే
స్వస్థత పరచు యెహోవా నీవే
నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా
మా ఆరోగ్యం నీవే ఆదరణ నీవే ఆనందం నీవెగా
ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము
వదలిపోవును వ్యాధి బాధలన్ని
శ్రమ పడువారిని సేదదీర్చి
సమకూర్చుము వారికి ఘన విజయం
పాపపు శాపము తొలగించుము
అపవాది కట్లను తెంచివేయుము
క్రీస్తుతో నిత్యము ఐక్యముగా
నీ మహిమలో నిత్యము వసింపనిమ్ము

