ఏదో రాగం పాడాలని ఉంది నాకు – Yedho Raagam Paadaalanundi
ఏదో రాగం పాడాలని ఉంది నాకు
రాగం రాదు తాళం తెలియదు నాకు
ఏ రాగమైనా ఏ తాళమైనా
నా గళం నిన్నే కీర్తించాలి యేసు
1. ఉదయాన్నే పక్షులు కిలకిల రాగాలు పాడాయి వింటుంటే మనసంతా పులకరించి పోతోంది. పచ్చని కొమ్మల్లో కమ్మని పాటలు వినిపించే
ఆ పాటలే నా యేసునామ సంకీర్తనయితే పాడాలనుంది కోయిలల
పాడలేను నేను అలా పాటేదైన నా ప్రియుడేసుని పాడనా నా ఊపిరిగా
2. సప్త స్వరాల సంగీత నాదం వినసొంపే
ఎన్నైనా రాగాలు నా యేసుని స్తుతి పాడని
చల్లంగా వీచేటి గాలుల్లో సన్నాయి మోగింది
గిటారు మీటి నీ ప్రేమను నే పాడని
వేకువ జామున వెదకేదా నాదుడేసుని
ముఖ దర్శనం వేవేల దూతల స్తుతి పాత్రుని
స్తుతి రాగం నే పాడనా
ఏదో రాగం పాడాలని ఉంది నాకు
రాగం రాదు తాళం తెలియదు నాకు
ఏ రాగమైనా ఏ తాళమైనా
నా గళం నిన్నే కీర్తించాలి యేసు

