Yesu Neeve Chalu Naku – యేసు నీవె చాలునాకు
యేసు నీవె చాలునాకు – వేరెవ్వరు అక్కరలేదు
నీవె నా ప్రాణము నీవె నా ధ్యానము
మనుషులు నను మరచిన… నా వారే విడిచిన
నింగినేల మారినా స్థితి గతులు మారినా
ఎన్నడెన్నడు మారనిది యేసునీ ప్రేమ
ఎన్నడైనను వీడనిది యేసునీ ప్రేమ
కంటిపాపవలె కాయు నీవుండగ..
దారితొలగి యుండగా మార్గమును చూపించినా
ముళ్లకిరీటము శిరమున ధరియించిన మారని ప్రేమ
రక్తము నాకై చిందించిన రక్షకుని ప్రేమ
నిత్యజీవమొసగె నీవుండగ..

