Neeku Asadhyamaindi Telugu Christian Song Lyrics, Composed & Arranged by Symonpeter Chevuri & Rev. DV Samuel – నీకు అసాధ్యమైనది
పల్లవి
నీకు అసాధ్య మైనది లేనే లేదయా
ఏ యోగ్యతలేని నాకు ఎంతటి భాగ్యము యేసయ్య
దీనులను దరిద్రులను పెంటకుప్పల పైనుండి
లేవనెత్తువాడవు నీవే యేసయ్య
మహిమగల సింహాసనము స్వతంత్రించుకొనుటకు
మట్టి నుండి నన్ను లేవనెత్తినావయ్యా
ఈనాటి నా స్థితిని నీ కృపయే ఇచ్చినది
నా ఊహలకంటే అధికముగా నను దీవించినది
1.ఎన్నికలేని కుటుంబం ఎన్నెన్నో నిరాశలే
బహు స్వల్పమైనది ఈ నా జీవితం
అడుగడుగున అవమానాలై నే నిందలపాలై
వస్త్ర హీనతతో గుండెలో గాయాలై
ఏలియా దేవుడా నా పక్షము నిలిచితివే
నా చేయి చాచకుండా నన్ను పోషించితివే
నా దుఃఖము తొలగించి సంతోషమునిచ్చితివే
2.పనికిరాని వాడనని పరిచర్య ఎందుకని
పదిముంది పలుమార్లు పరిహాసము చేసినా
దర్శనమే ఉన్నను ధైర్యమే కోల్పోయినా
దిగులుపడిన వేళలో కన్నీటి సంద్రమైన
యోసేపు దేవుడా నా పక్షము నిలిచితివే
నే ఓడిన చోటనే నన్ను గొప్ప చేసితివే
అవమానభారములే దీవెనగా మార్చితివే
3.నీ పిలుపును పొందుకొని నీలోనే నే నుండుటకై
దీనునిగా నే నుండి నీ సంకల్పం చేయుటకై
నీవచ్చిన వరమేగా ఈ సేవా జీవితం
నీ శాశ్వత కృపయేగా ఈ దర్శన భాగ్యం
హానోకు దేవుడా నా పక్షము నిలిచితివే
తొట్రిల్లపోనీయక క్షేమముగా నడిపితివే
ఘనమైన నీ సేవను నన్ను చేయనిచ్చితివే
ఆరాధన నీకే స్తుతి ఆరాధన
ఆరాధన నీకే స్తుతి ఆరాధన
ఆరాధన నీకే స్తుతి ఆరాధన
ఆరాధన నీకే స్తుతి ఆరాధన
Neeku Asadhyamaindi Lyrics in English
Neeku Asadhyamaindi Song Lyrics, నీకు అసాధ్యమైనది Lyrics
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christian song ‘Neeku Asadhyamaindi’ composed by Symonpeter Chevuri and Rev. DV Samuel.
- The song expresses themes of divine fortune and support amidst life’s struggles.
- It features multiple verses highlighting an individual’s spiritual journey and reliance on God.
- The lyrics emphasize gratitude and worship, concluding with repeated praises to God.
Estimated reading time: 2 minutes

