Nee Paadala chentha Telugu Christian song Lyrics, Written and Sung by Harsha Singavarapu & Sis. Roselin – నీ పాదాల చెంత
నీ పాదాల చెంత నేనుంటా యేసయ్యా
నీ చిత్తము చేయుటే నా జీవిత గమ్యమయా
ఏ అర్హత నెంచక నను హత్తుకుంటివి
నా జీవితాన్ని అమూల్యమనెంచితివి
నీ కోసమే నా గానము నీ కోసమే నా పయనము
నీ కోసమే…నీ కోసమే…యేసయ్యా
కన్నీటి కథలతో నిండిన నా లోకాన్ని
సంతోష గానముగా మార్చితివి నీ కృపతో
కలవరపు చీకట్లో కూలిన జీవితాన్ని
కరుణించి తేజోమయముగా మార్చిన యేసయ్యా
నీ కోసమే నా గానము నీ కోసమే నా పయనము
నీ కోసమే…నీ కోసమే యేసయ్యా – నీ కోసమే
పడిపోయిన చోటే నన్ను నిలువబెట్టి
పగిలిన కలలకు జీవమిచ్చితివి నీ కృపతో
నీదు వాక్యముతో నన్ను సరిచేసి
ప్రేమించి క్షమించి ఇలా నిలిపితివేసయ్యా…
నీ కోసమే నా గానము నీ కోసమే నా పయనము
నీ కోసమే…నీ కోసమే యేసయ్యా – నీ కోసమే
Nee Paadala chentha Lyrics in English
Nee Paadala chentha Song Lyrics, నీ పాదాల చెంత Lyrics
Faith Gospel Church Ministries
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christian song ‘Nee Paadala chentha’ written and sung by Harsha Singavarapu and Sis. Roselin.
- The song expresses devotion to Jesus, highlighting themes of grace, healing, and purpose.
- Published by World Telugu Christians, the article also provides links to other Telugu Christian songs.
- The lyrics emphasize a personal relationship with Jesus and the transformative power of His love.
- The article includes a section with English lyrics and additional song recommendations.
Estimated reading time: 2 minutes

