ఎంత చిత్రమో నీ ప్రేమ యేసయ్య – Enta citramo ni prema yesayya
ఎంత చిత్రమో నీ ప్రేమ యేసయ్య
ఎంత వింతయో నీ సృష్టి యేసయ్య
చిత్రమే అది చిత్రమే మన బంధము చిత్రమే
చిత్రమే అది చిత్రమే నీ అనురాగము చిత్రమే
ఎన్నికలేని నన్ను లోకమంత కాదనగా
అర్హతే లేదని నన్ను తులనాడగా
నీ ప్రేమయే నన్ను చూచేను యేసయ్య
నీ మాటయే నన్ను ఆధరించెను
జ్ఞానము లేక నేను త్రోవ తప్పి నడువగా
గమ్యము తెలియక నిషిధిలో ఉండగా
వాక్యము నాకు చూపిన యేసయ్య
నీ ఆత్మతో నన్ను వెలిగించితివి
ఒంటరినైన నన్ను విడువక ఎడబాయక
శిలనై యుండగా మలచి రూపమిచ్చితివి
ప్రేమతో నను చేరదీసిన యేసయ్య
నీ కౌగిలిలో నను దాచినావయా

