గడచిన కాలం చాలు – Gadachina Kaalam

Faith Score0
Faith Score0

గడచిన కాలం చాలు – Gadachina Kaalam

గడచిన కాలం చాలు చేసిన పాపానికి
ఇకనైనా వెనుకకు చూడు సిలువ వైపుకి ,,2,,

రావయ్యా సహోదరా … రావమ్మా సహోదరీ …
చేతులు చాపి యేసు పిలుచు చున్నాడు
రక్షణ పొందాలని కోరుకొనుచున్నాడు ,,2,,

1. దుర్దినములు వస్తున్నాయి చీకటేమో కమ్ముచున్నది
యుద్ధము సిద్దమన్నది అంతమే పొంచియున్నది ,,2,,
కరువు భూకంపాలు కలవర పెడుతున్నాయి ,,2,,
వ్యాది రోగ సంకటాలు నాశనం చేస్తున్నాయి ,,2,, రావయ్యా ..

2. స్త్రీలు చెరుపబడుచున్నారు భయముతో బ్రతికున్నారు
కామాంధులు కాటేసారు పసి మొగ్గలు రాలుచున్నారు ,,2,,
నేరాలు ఘోరాలు పెరిగి పోతున్నాయి ,,2,,
హత్యలు ఆత్మ హత్యలు విస్తరించుచున్నాయి ,,2,, రావయ్యా ..

3. అజ్ఞ్యానం అలుముకున్నది మతోన్మాదం పెరుగుచున్నది
సువార్త మూయబడినది రక్షణేమో జరుగకున్నది ,,2,,
దైవజనులెందరో చంపబడుచున్నారు ,,2,,
ప్రార్ధనా మందిరాలు కూల్చివేయుచున్నారు ,,2,, రావయ్యా ..

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo