నా యెడల నీవు చూపిన నీకృప అధికమైనది నాయేసయ్య – Naa Yedala nivu Chupina krupa
పల్లవి : నా యెడల నీవు చూపిన నీ కృప అధికమైనది నా యేసయ్య |॥2॥
నీ కరుణాకటాక్షములే నన్ను కనికరించెను ॥2॥ కృతజ్ఞుడనై నీ సన్నిధిలో జీవింతును ॥4॥ యేసయ్య నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నా ప్రాణనాధుడా ॥2॥
చరణం :
నా ఒంటరి పయనములో ఏదిక్కుకానరాని స్థితిలో ॥2॥ ఏ తోడులేక వేదనపడుతున్న వేళలో ॥2॥
తల్లివలే ఆదరించి – తండ్రివలె ధైర్యపరచి – విడువక కృప చూపినావు
నీ ప్రత్యక్షతతో నన్ను దర్శించి ఘనపరిచిన నా యేసయ్య ॥2॥
॥ కృతజ్ఞుడనై ||
చరణం :
నా జీవన యాత్రలో గాఢాంధకారపు లోయలో ॥2॥
నా వారే నాకు శత్రువులై గాయపరచగా ॥2॥
చేరదీసి – క్షేమమిచ్చి
ప్రేమ చూపి – నను పిలిచి మరువక నను నడిపినావు ॥2॥ నీ అనురాగముతో – నన్ను స్నేహించి బలపరిచిన నా యేసయ్య ॥2॥
|| కృతజ్ఞుడనై ||
చరణం :
నా హృదయ వేదనలో – నే కృంగిపోయిన వేళలో ॥2॥ నను ఓదార్చి – నీకై బ్రతికించినావు ॥2॥
రక్షణిచ్చి – ఆత్మనిచ్చి
వాక్యమందు నను నిలిపి-సేవకునిగా నను మలచినావు
॥2॥ నీ మందను కాచి – పరముకు చేరే భాగ్యనిచ్చిన యేసయ్య ॥2॥
ప్రార్ధన : దైవదర్శనము ద్వారా రాసిన పాట ఇది
నాకు కలిగిన శ్రమలను కలిగిన ఆవేదనలను బట్టి నా ఆధ్యాత్మిక జీవితంలో ఎదురైన సమస్యలన్నింటినీ ఈ పాటలో రచించటానికి
దయ గలిగిన దేవుడు కృప చూపాడు
ఈ పాటను వీక్షిస్తూ వినుచున్న వారందరికీ నా దేవుడు ధైర్యాన్ని ఆదరణను ఓదార్పును కలుగచేసి ఆత్మీయ జీవితంలో కృపతో నింపి నడిపించును గాక
ఆమెన్

