విశ్వాసీ ఓ విశ్వాసీ – Visvasi o Visvasi
Shop Now: Bible, songs & etc
విశ్వాసీ ఓ విశ్వాసీ – Visvasi o Visvasi
విశ్వాసీ… ఓ విశ్వాసీ
విశ్వాసీ ఎదిరించు అపవాదిని
సర్వాంగ కవచము ధరించుకొని
సాక్షి సమూహము ఆవరించెను
మేఘముల వారు కమ్ముకొనెను
సత్యమనే దట్టిని నీ నడుముకు కట్టుకో
అసత్యము నిన్నేలకుండా అది నిన్ను కాపాడును
నీతి అనే మైమరువును నీవు తొడుగుకొనుము
అవినీతి నిను చేరకుండా
హృదయమును కాపాడుకొనుము
నీ హృదయమును కాపాడుకొనుము
సమాధాన సువార్తను నీ జోడుగా తొడుగుకో
అశాంతి నిన్నేలకుండా అది నిన్ను నిలబెట్టును
విశ్వాసమనే డాలు నీవు జాగ్రత్తగా పట్టుకొనుము
అవిశ్వాసిగా నుండకుండా అగ్నిబాణములను ఆర్పుము
అగ్నిబాణములను ఆర్పుము
రక్షణ శిరస్త్రాణము శిరముపై ధరించుము
రక్షణ జీవితములో కడవరకు కొనసాగుము
వాక్యమనే ఆత్మఖడ్గం నీ చేతితో పట్టుకొనుము
దుష్టుని ఆలోచనలను ఖండించి పోరాడుము
నీవు ఖండించి పోరాడుము