Nee Asha Nirasha – నీ ఆశ నిరాశ కానేకాదు
Telugu Christian Song | Dr. Betty Sandesh | LCF Church
నీ ఆశ నిరాశ కానేకాదు వేదన ఎందుకు
నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు
నమ్మునేస్తమా ఇదిసత్యం వీడబోకుమా విశ్వాసం
1 . అవసరాన్ని బట్టి అగ్నివంటి శ్రమలు
కలుగుచున్నవని తెలిసీ కలత చెందబోకు
నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు
శోధనలో నిన్ను విడిచి పెట్టిపోడు –
కంటిపాపలా తోడుండి నిను కాచుకుంటాడు
కన్నతండ్రిలా తోడుండి నిను ఆదుకుంటాడు
| | నమ్ము నేస్తమా | | నీ ఆశ | |
2 . కాల్చ బడకపోతే స్వర్ణం విలువ పొందలేదు
చీల్చ బడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు
దున్న బడకపోతే భూమి పంట నివ్వలేదు
చెక్క బడకపోతే శిల శిల్పం కాదు
శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపురాదు
| | నమ్ము నేస్తమా ॥ ॥ నీ ఆశ ॥


