అద్భుతముల కొరకు ఆశించుచున్నాము – Adbhuthamulakoraku

Faith Score+2
Faith Score+2

అద్భుతముల కొరకు ఆశించుచున్నాము – Adbhuthamulakoraku

రచన: షారోన్ రోజ్ కొమానపల్లి

స్వరకల్పన: పి. నోవ

పల్లవి: ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
అ.ప:
అద్భుతముల కొరకు ఆశించుచున్నాము
నీకు అసాధ్యమేదియు – లేనే లేదు యేసయ్యా యెహోవా “యీరే” – యెహోవా “షాలోమ్” యెహోవా “నిస్సీ” – యెహోవా “రాఫా”

1. వాగ్దానములు చేయువాడా – నమ్మదగినదేవా వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగలదేవుడవు మాటతప్పనివాడవు – మార్పులేనివాడవు
నిన్న నేడు నిరతము – ఉన్నవాడవు
మహతైన కార్యములు – మహాశ్చర్య కార్యములు అద్భుతములు చేయుము

2. సమస్తము సాధ్యము చేయువాడా – సజీవుడైన వాడా
నీళ్ళను ద్రాక్షారసముగా మార్చి – అద్భుతం చేసితివి
అరణ్య యాత్రలో మన్నాతో ఆకలి తీర్చితివి బండనుండి నీటి ఊటతో దాహము తీర్చితివి మహతైన కార్యములు – మహాశ్చర్య కార్యములు అద్భుతములు చేయుము ॥యెహోవా॥

3. చీకటిని ఉదయముగా మార్చు – నీతి సూర్యుడవు లేనివాటిని ఉన్నట్లుగానే – పిలుచు దేవుడవు మృతులను సజీవులుగా – చేయు దేవుడవు సమాధినుండి లాజరును – లేపిన నాధుడవు మహతైన కార్యములు – మహాశ్చర్య కార్యములు అద్భుతములు చేయుము ॥యెహోవా॥

Adbuthamula Koraku Ashinchuchunnamu song lyrics

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo