Anukonuta Nerpayya – ఆనుకొనుట నేర్పయ్య

Faith Score+7
Faith Score+7

Anukonuta Nerpayya – ఆనుకొనుట నేర్పయ్య

ఆనుకొనుట నేర్పయ్య – ఆదుకొనే యేసయ్య
ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన

నీవే చెయ్యాలయ్యా కార్యం -నీవే చూపాలయ్యా మార్గం
నిన్నే నమ్ముకున్నాను- వేరే దారి లేదయ్యా

  1. ఈ లోక యాత్రలో – కానను బాటలో
    నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా
    పిలిచినా స్నేహమా – ఏర్పరిచిన దైవమా 2
    పర్వతములన్ని దాటించుటకు చాలిన హస్తమా 2
  2. నా బాల్యస్నేహమా-నా గుండె దైర్యమా
    గోతిలోనుండి లేవనెత్తి నను నిలిపిన దైవమా
    నా క్షేమ క్షే త్రమా, నా హృదయ గీతామా 2
    మనుష్యుల మాయోపాయమునుండి తప్పించు జ్ఞానమా
  3. నా పాప జీవితం -చంచల వర్తనం
    క్రీస్తు సిలువ రక్తముతో- కడిగి ముద్ర వేసావయా
    నా భక్తి కాదయా కృప మాత్రమేనయా
    కడవరకు నమ్మకముగా సాగే కృపనిమ్ము యేసయ్య
We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo