Athma Nimpuma – ఆత్మ నింపుమా
ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా
పరమ పావనాత్మ నీదు వరములీయుమా
ఆత్మ నింపుమా..
- కలుష దోష భారములే బ్రతుకు క్రుంగ దీసినవి వ్యాధి బాధలేకములై కేదమాయెను – ఘన దైవమా… ఆఆ….. నీ దాపు చేర్చి ప్రాపు చూపుమా అనుదినము నీదు ఆశ్రయాన సేద తీర్చుమా
- అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి ఒడలు పాప పొడల చేత యేహ్యమాయెను – కరుణాత్మ శ్రీ… ఆఆ….. ఈ కరుణ మెంచి శరణమీయుమా తృణమైన బ్రతుకు తూలిపోక జాలిచూపుమా
Andhra Christhava Keerthanalu ఆత్మ నింపుమా Athma Nimpuma

