Devuni Yandu Neerikshanayunchi – దేవునియందు నిరీక్షణ నుంచి

Faith Score0
Faith Score0

Devuni Yandu Neerikshanayunchi – దేవునియందు నిరీక్షణ నుంచి

దేవునియందు నిరీక్షణ యుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా

1. ఏ అపాయము రాకుండ నిన్ను దివారాత్రులు కాపాడువాడు
ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు

2. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీముందు పోవువాడు
సత్యమగు జీవమగు మార్గామేసే

3. తల్లి తన బిడ్డను మరచినను – మరువడు నీ దేవుడు నిన్ను
తల్లికన్న తండ్రికన్న ఉత్తముడు

4, నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే
ఆధారము ఆదరణ ఆయనలో

5. నీకు విరోధముగా రూపించిన ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు
శత్రువులు మిత్రులుగా మారెదరు

6. పర్వతములు తొలగిపోయినను – తన కృప నిను ఎన్నడు వీడదు
కనికర సంపన్నుడు నా దేవుడు

7. స్తుతిమహిమలు నీకే ప్రభూ – నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలుయా – హల్లెలుయా – హల్లెలుయా

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo