ఏమని వర్ణింతును ప్రభో – Emani varninthunu prabho song lyrics

Faith Score+2
Faith Score+2

ఏమని వర్ణింతును ప్రభో – Emani varninthunu prabho song lyrics

ఏమని వర్ణింతును ప్రభో, మా పైన నీవు చూపు ప్రేమను
ఏమని వివరింతును యేసు, మా పైన నీవు చూపు ప్రేమను
అనంతమైన నీ ప్రేమను 2
ఏమని పాడెదను యేసు, ఏమని పొగడెదను 2
అనుపల్లవి, నీ ప్రేమ మధురము యేసయ్య, నీ ప్రేమ అమరమూ మెస్సయ్య, ఏమని.

1 మా పాపములచే అపరాధములచే చచ్చిన వారమైన మమ్ములను 2
నీ ప్రేమతోనే బ్రతికించినావే 2, నీ వారసునిగా నన్ను మార్చినావే, నీ వారసునిగా నన్ను మార్చినావే
నీ ప్రేమ మధురము యేసయ్య నీ ప్రేమ అమరమూ మెస్సయ్య , ఏమని.

2.ఎనలేని ప్రేమ మా పైన చూపి, ఎంచదగినవారిగా మము మార్చినావు 2
ఎన్నిక లేని మమ్ము ఏర్పరచుకుంటివే 2, పరలోక రాజ్యము అనుగ్రహించితివే, పరలోక రాజ్యము అనుగ్రహించితివే
నీ ప్రేమ మధురము యేసయ్య, నీ ప్రేమ అమరమూ మెస్సయ్య, ఏమని.

3 ఏ రాగమందు ఆలపింతునయ్యా, పదములు చాలని నీ ప్రేమను 2
బ్రతుకు దినములన్నిట నీ ప్రేమ గానం 2, మా నోట నుంచుమా, ఈ ఆశ తీర్చుమా మా నోట నుంచుమా, ఈ ఆశ తీర్చుమా
నీ ప్రేమ మధురము యేసయ్య, నీ ప్రేమ అమరమూ మెస్సయ్య, ఏమని

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo