ఎంత ప్రేమ ఎంత జాలి – Entha Prema
ఎంత ప్రేమ ఎంత జాలి
ఎంత కరుణ యేసయ్యా/2/
నీవు లేని బ్రతుకు నాకు
సూన్యమో యేసయ్యా/2/
“యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా”/2/
1.నన్ను నీవు పిలచుకొని
నన్ను నీలో చేర్చినావు/2/
ఆదరించి కనికరించి
కాచినావు యేసయ్యా/2/ //యేసయ్యా//
2.నీదు మరణం నాకు మోక్షం
నీదు సిలువ నాకు గమ్యం/2/
పేరు పెట్టి పిలచినావు
నన్ను నీలో యేసయ్యా/2/ //యేసయ్యా//

