Idigo Vinuma O Lokama Thvaralo Prabhuvu – ఇదిగో వినుమా ఓ లోకమా త్వరలో
Idigo Vinuma O Lokama Thvaralo Prabhuvu – ఇదిగో వినుమా ఓ లోకమా త్వరలో
ఇదిగో వినుమా ఓ లోకమా త్వరలో ప్రభువు రానుండెను
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
మరనాత… ||ఇదిగో||
మహా మహా ఆర్భాటముతో – ప్రధాన దూత శబ్దముతో
దేవుని బూరతో ప్రభువు వేగమే దిగివచ్చును
ప్రభునందు మృతులు లేతురు సమాధులు తెరువగ
విశ్వాసులంత దాల్తురు మహిమ రూపును వింతగ
ఎత్తబడును సంఘము అయ్యో విడువబడుట ఘోరము
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
మరనాత… ||ఇదిగో||
ఏడేండ్లు భువిపై శ్రమకాలం – ప్రాణాలు జారే భయకాలం
ఊరలు తెగుళ్ళు దైవ ఉగ్రత పాత్రలు
ఆకాశ శక్తుల్ కదలును గతి తప్పును ప్రకృతి
కల్లోలమౌను లోకము రాజ్యమేలును వికృతి
సంఘమెంతొ హాయిరా మధ్యాకాశన విందురా
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
మరనాత… ||ఇదిగో||
అన్యాయము చేయువాని చేయనిమ్ము
అపవిత్రుడట్లే యుండనిమ్ము
పరిశుద్ధుడింకను పరిశుద్ధునిగుండనిమ్ము
ప్రతివాని క్రియల జీతము ప్రభు తెచ్చును ఒక దినం
రహాస్య క్రియలు అన్నియు బయలుపడునులే ఆ దినం
లోక ధనము కూడిరా నీకుంద పై సంపద ఆ…ఆ…
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
మరనాత ||ఇదిగో||
ఓలీవకొండపై రారాజు అడుగుపెట్టెడి ఆరోజు
కొండయే చీలును భూగోళమే కంపించును
ప్రతి జనం ప్రభునే చూచును ప్రతి జాతియు మ్రొక్కును
నిజమైన ప్రభువు యేసని ప్రతి నాలుక ఒప్పును
ప్రభుని రెండవ రాకడ సాతానుకు దడదడ ఆ….ఆ…
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
మరనాత ||ఇదిగో||
వెయ్యేండ్లు భూమిపై ప్రభు యేసు పాలించును పరిపాలించును
నీతి సమాధానం ఆత్మయందలి ఆనందం
ఈ భూమ్మీద నీ కృత్యముల్ సమస్తం కాలిపోవును
మిక్కటమైన వేడితో పంచభూతముల్ లయమగును
క్రొత్త భూమి ఆకాశం ఇక శాశ్వత జీవితం
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
మరనాత ||ఇదిగో||
క్రీస్తేసులో విశ్వసించువారే పరిశుద్ధులుగా తీర్చబడ్డవారే
దేవుని మహిమకు నిత్యజీవమునకు అర్హులు
జీవం మరణం రెండును నీ యెదుటనే యున్నవి
ప్రభు యేసే జీవ మార్గమని నీకు తెలుపబడియున్నది
విశ్వసించు ప్రియుడా కాదు
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
- ఇదిగో దేవా నా జీవితం – Idigo Devaa Naa Jeevitham Song Telugu Andhra Kraisthava Keerthanalu
- JANMINCHE | SAMY PACHIGALLA | DAVIDSON GAJULAVARTHI | | LATEST TELUGU CHRISTMAS SONGS
- Janinchenu Nede song lyrics – ఇదిగో శుభదినం మనమానందించేదం
- జన్మించే లోకరక్షకుడు – Janminche Lokarakshakudu
- Shaaronu Polamulo – షారోను పొలములో
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."