యెహోవా నీ నామము – Yehova Nee Namamu Telugu christian song lyrics
యెహోవా నీ నామము – ఎంతో బలమైనదీ ఆ…ఆ…ఆ…ఎంతో బలమైనదీ
యెసయ్య నీ నామము – ఎంతో ఘనమైనదీ ఆ…ఆ…ఆ…ఎంతో ఘనమైనదీ
యెహోవా నీ నామము
1.మోషే ప్రార్దించగా – మన్నాను కురిపించితివి
యెహోషువ ప్రార్దించగా – సూర్యచంద్రుల నాపితివి
యెహోవా నీ నామము…
2.నీ ప్రజల పక్షముగా – యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి
యెహోవా నీ నామము…
3.సింహాల బోనుకైనా – సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే – రక్షించె నీ హస్తము
యెహోవా నీ నామము


