mandiram nee mandiram – మందిరం నీ మందిరం
పల్లవి :
మందిరం నీ మందిరం – నీ మహిమ నివసించు స్థలము
మందిరం నీ మందిరం – నీ దాసుడు కోరుకున్న వరము
అనుపల్లవి :-
పాట పాడెదం పరవశించెదం – మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయని
పాట పాడెదం పరవశించెదం – మా నిత్య స్వాస్థ్యము నీ మందిరమేనని
1 చరణం :-
నీ మందిరములో నివసించువారు ధన్యులు
నిత్యము నిన్ను స్తుతియించెదరు (2)
నీ రెక్కల నీడలో ఆశ్రయము పొంది (2)
నీ మందిరం మేలుతో తృప్తిగా ఉందురు (2)
|| పాట పాడెదం ||
2 చరణం :-
నీ మందిరములో నాటబడిన వారు ధన్యులు
మేటిసారము కలిగి పచ్చగా ఉందురు (2)
ఖర్జూర చెట్టు వలే మొవ్వు వేయుచు (2)
దేవదారు వృక్షము వలే ఎదుగుచుండెదరు (2)
|| పాట పాడెదం ||
3 చరణం :-
నీ మందిరములో నీ ప్రసన్నతను చూడాలని
నీ కృపాసత్యములను ధ్యానించాలని (2)
నా బ్రతుకు దినములన్ని దానిలో గడపాలని (2)
నా ప్రాణము ఎంతో తృష్ణగొనుచున్నది (2)
|| పాట పాడెదం ||

