మరువనిది నీ ప్రేమ – maruvanidhi nee prema song lyrics

Faith Score+1
Faith Score+1

మరువనిది నీ ప్రేమ – maruvanidhi nee prema song lyrics

పల్లవి :మరువనిది నీ ప్రేమ
విడువనిది నీ కృప
ఎడబాయనిది నీ వాత్సల్యము
స్థిరమైనవి నీ తలంపులు

అను పల్లవి : ఘనుడా నిన్ను ఘనపరతును
నా జీవమున్నంతవరకు
ప్రియుడా నిన్ను ప్రణుతింతును
నా ప్రాణం ఉన్నంత వరకు

1.అపజయ ధ్వనులే నా చుట్టూ మ్రోగగా
నిరీక్షణ లేని నిశిధి వేళలో
అజేయుడా! నీ ఆదరణతో నింపి
అనంత కృపతో నన్ను స్థిరపరిచినావు
|| ఘనుడా నిన్ను ఘనపరుతును ||

2.గమ్యము యెరుగక కలత చెందగా
ప్రయాణమే భారమైన వేళయందున
విజేయుడా! నీ విజయానందముతో
నడిపించినావు నూతన మార్గమున
|| ఘనుడా నిన్ను ఘనపరుతును||

3.భీకర ధ్వని గల ఎడారిలో నేనుండగా
ఆధారమే లేక కృంగిన వేళలో
శ్రీమంతుడా! నీ ప్రేమ మాధుర్యము
నింపెను నాలో నూతన ఉత్తేజం
|| ఘనుడా నిన్ను ఘనపరుతును ||

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo