చుట్టూ గాడంధకారం – Na vakkunu
- చుట్టూ గాడంధకారం వెలుగే లేని సమయం
ఎటు తోచని నా పయనం గమ్యం ఎరుగని తరుణం ||2||
నీ దర్శన కాలమందు నేను మొరలిడగా
నీ వాక్కును వెల్లడి పరచి వెలుగు నింపితివే ||2|| - వేదన నిండిన హృదయం నెమ్మది లేని సమయం
అవమానాల వలయం ఆశలు విడిచిన తరుణం ||2||
నీ మందిర ఆవరణములో ఆశతో చేరగా
నీ తేజోమహిమతో నింపి శాంతి నొసగితివి ||2||

