Na Yesuni Jali Preme Nannu Rakshinchenu – నా యేసుని జాలి ప్రేమే నన్ను రక్షించెను

Faith Score0
Faith Score0

Na Yesuni Jali Preme Nannu Rakshinchenu – నా యేసుని జాలి ప్రేమే నన్ను రక్షించెను

నా యేసుని జాలి ప్రేమే నన్ను రక్షించెను
ఆ ఘోర కల్వరిగిరిలో ప్రాణమర్పించగా IIనాII

శాశ్వతంబగు ప్రేమతోడ నన్ను ప్రేమించి
విడువక నాయందు తన కృప జూపియుంచెను IIనాII

గొర్రెవలెనే త్రోవ తప్పి తొలగియుంటిని
వెదకి వెదకి వెంబడించి నన్ను కనుగొనెను IIనాII

మేలు చేయువాడు లేడు ఒక్కడును లేడు
మేలు చేయను నాదు ప్రభువు మరణమాయెను IIనాII

పాపిపై నేనింకనుండ ప్రాణ మొసగెనుగా
ప్రేమను నాయందు విభుడే వెల్లడించెను IIనాII

ప్రాణమివ్వగ నాదు సోదర ప్రియులకై ప్రియుడు
తనదు ప్రేమ నాకు నేర్పి నిలిపె తన కృపతో IIనాII

అద్వితీయ కుమారుడాయన యందు నమ్మితిని
నిత్యజీవము నాకు పంచి దాచియుంచెను IIనాII

ఆనందము నాకానందము హల్లెలూయ స్తుతుల్
పరమ యెరుషలేము నాకై నిలిచియుండగను IIనాII

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo