Naa Priyuda Nee Rakhatho Telugu christian song lyrics – నా ప్రియుడా నీ రాకతో
నా ప్రియుడా నీ రాకతో నా జీవితం పరిపూర్ణత నొందినది
సూర్యుని తేజమును చంద్రుని అందమును
నాలో కలిగించే ఆ ప్రభు సహవాసం
ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు
నల్లని దానను ఎండకు నేను ద్రాక్షావనముకు కావాలి యుంటిని
అడవికి నేను పరిమితమైతిని
ఆశలు బ్రతుకులో కోల్పోయితిని దయగల దేవా నన్ను చూచితివి
అంతఃపురముకు నన్ను పిలచితివి
మరణము వరకు ప్రేమించితివి
బండ సందులలో బ్రతికించితివి
సిలువలో గుణమును సరిజేసితివి
అడవిలో గువ్వగా నన్ను చేసితివి
ముఖమును సొగసుగా మార్చితివి
స్వరమును మధురము గావించితివి
ధూమ స్తంభముగా రూపించితివి స్వయమంతయును తొలగించితివి
సొలొమోను పల్లకీగా మార్చితివి
నిన్ను మోయుటకు సాక్షిగా నైతిని
నీ రూపమును నాకొసగితివి
చూచెదరంతా నాలో నిన్ను

