పల్లవి: నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో.. మైమరచితిని నా మదిని దేవా..!-2 నా ప్రతికూలతలో నా చెయ్యిపట్టి నన్నాధరించి నడిపించితివే..-2. [నే పడిపోతిని]
1) ఈ లోక స్నేహముతో నేను కలిసి – రక్షణ జీవితం విడిచితినే మేలులెన్నో పొందిన క్షణమే – సత్యాన్ని విడిచి నడిచితినే-2 నీ రక్తముతో నను కడిగితివే – నీ సహనముతో నను నడిపితివే-2. [నే పడిపోతిని]
2) నా పాప భారమంత నీవు భరియించి – ఆ సిలువ భారము మోసితివే నా ప్రాణమునకు నీ ప్రాణము బలియిచ్చి – ఎనలేని ప్రేమను చూపితివే -2 శుద్దుడవు పరిశుద్దుడవు – శుద్దాహృదయం నాకు ఇచ్చితివే -2. [నే పడిపోతిని]
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."