Nenellappudu Lyrics – నేనెల్లప్పుడు యెహోవా నిను

Faith Score0
Faith Score0

Nenellappudu Telugu Christian Song Lyrics, written Tune, Music & Voice by Dr. A.R.Stevenson – నేనెల్లప్పుడు యెహోవా నిను

నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను
నిత్యము నీ కీర్తి నా నోట నుండును
అ.ప. : మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా

1. కలిమి చేజారి నను వంచినా
స్థితిని తలక్రిందులే చేసినా
రెండింతలుగా దయచేసెదవని
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా

2. పరుల ఎగతాళి శృతిమించినా
కలవరము గుండెనే పిండినా
నా మొర విని కృప చూపెదవని
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా

3. శ్రమలు చెలరేగి బెదిరించినా
ఎముకలకు చేటునే తెచ్చినా
ఆపదలలో విడిపించెదవని
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా

Nenellappudu Lyrics in English

Nenellappudu Song Lyrics, నేనెల్లప్పుడు యెహోవా నిను Lyrics

Estimated reading time: 1 minute

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo