Nee Jeevithamlo Gamyambu Edo Okasari Yochinchava – నీ జీవితములో గమ్యంబు ఏదో

Faith Score0
Faith Score0

Nee Jeevithamlo Gamyambu Edo Okasari Yochinchava – నీ జీవితములో గమ్యంబు ఏదో

నీ జీవితములో గమ్యంబు ఏదో
ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు
నీ హృదయమర్పించవా (2) ||నీ ||

నీ తల్లి గర్భమున నుండినపుడే
నిను చూచే ప్రభు కన్నులు ఆ ఆ..(2)
యోచించినావా ఏ రీతి నిన్ను
నిర్మించే తన చేతులు (2) ||నీ ||

నీలోన తాను నివసింపగోరి
దినమెల్ల చేజాచెను ఆ ఆ..(2)
హృదయంపు తలుపు తెరువంగ లేవా
యేసు ప్రవేశింపను (2) ||నీ ||

తన చేతులందు రుధిరంపు ధారల్
స్రవియించే నీకోసమే ఆ ఆ..(2)
భరియించె శిక్ష నీకోసమేగా
ఒకసారి గమనించావా (2) ||నీ ||

ప్రభు యేసు నిన్ను సంధించునట్టి
సమయంబు యీనాడేగా ఆ ఆ..(2)
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరా
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరీ ||నీ ||

 

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo